శ్చ్యోతన్మయూఖే2పి హిమద్యుతౌ మే ననిర్వృతం నిర్వృతమేతి చక్షుః
సముజ్ఝితజ్ఞాతివియోగఖేదం త్వత్సన్నిధావుచ్ఛ్వసతీవ చేతః ||
శ్చ్యోతన్మయూఖే – (అమృతమును) స్రవించుచున్న కిరణములు కల
హిమద్యుతౌ అపి – చంద్రునియందు కూడ
న నిర్వృతమ్ – సుఖమును పొందని
మే చక్షుః – నా కన్ను
త్వత్సన్నిధౌ – నీ సన్నిధిలో
నిర్వృతమ్ ఏతి – సాంత్వన పొందుచున్నది.
సముజ్ఝిత జ్ఞాతివియోగ దుఃఖమ్ – బంధుజనులకు దూరమైనందువల్ల కలిగెడి దుఃఖమును విడిచినదై
చేతః – మనస్సు
సముచ్ఛ్వసతి ఇవ (అస్తి) – మరల ఆశ్వాసించుచున్నట్లు (ప్రాణవంతమైనట్లు, ఊపిరి తీసుకున్నట్లు) అయినది.
అమృతమును స్రవించు కిరణములు కల చంద్రునియందు కూడ సుఖమును పొందని నా కన్ను నీ సన్నిధిలో సాంత్వన పొందుచున్నది. బంధుజనులకు దూరమైనందువల్ల దుఃఖితమైన నా మనస్సు ఆ దుఃఖమును విడిచిపెట్టి ఇప్పుడు మరల ఊపిరి తీసుకున్నట్లయినది. (నిన్ను చూసి ప్రాణం లేచివచ్చింది).
శ్చోత - m. oozing , sprinkling , aspersion L.
శ్చోతన - n. the act of oozing or flowing , exudation (see %{pra-zc-})
శ్చోతన్మయూఖ - fn. (pr. p. of %{zcut} + %{m-}) diffusing light MW.
ఆశ్వస్ - P. %{-zvasiti} and %{-zvasati} (Impv. 2. sg. %{-zvasihi} and %{-zvasa} [MBh. vi , 490] ; impf. %{-azvasIt} [Bhat2t2.] and %{-azvasat} [Katha1s. xxxiii , 129]) A1. %{-zvasate} , to breathe , breathe again or freely ; to take or recover breath , take heart or courage ; to revive MBh. R. Katha1s. BhP. &c.: Caus. %{-zvAsayati} , to cause to take breath ; to encourage , comfort ; to calm , console , cheer up MBh. Sus3r. Ragh. Kum. &c.
ఆశ్వాస - m. breathing again or freely , taking breath ; recovery Sus3r. ; cheering up , consolation ; relying on Katha1s. ; a chapter or section of a book Sa1h.
* శ్లోకంలో శ్చ్యోత అని ఉంటే, డిక్షనరీలో శ్చోత అని మాత్రమే ఉంది. ఏది సరైనదో తెలీడం లేదు.

2 వ్యాఖ్యలు
ఈ టపాకి వ్యాఖ్యల ఫీడు
మే 3, 2010 వద్ద 4:08 అపరాహ్నం
Vadapalli SeshaTalpaSayee
అదే నిఘంటువులో కొంచెం పైన
“శ్చుత్” కు వివరణలో ..
(often in later language written %{zcyut} ;
–
బహుజనపల్లి శబ్దరత్నాకరము
శ్చ్యోతము – జలాదిధార. కాఱుట. (అని కొందఱు.)
–
కిరాతార్జునీయమును పూర్తిగా వివరిస్తారని ఆకాంక్షిస్తూ,
శేషతల్పశాయి.
మే 3, 2010 వద్ద 4:39 అపరాహ్నం
nagamurali
శాయి గారూ, మీ కామెంటుకు, సందేహ నివృత్తి చేసినందుకు అనేక ధన్యవాదాలు.
ఈమధ్య కొంచం పని ఒత్తిడిలో పడి ఈ బ్లాగుని కొనసాగించలేదు. మళ్ళీ తప్పకుండా మొదలుపెడతాను.