శ్చ్యోతన్మయూఖే2పి హిమద్యుతౌ మే ననిర్వృతం నిర్వృతమేతి చక్షుః

సముజ్ఝితజ్ఞాతివియోగఖేదం త్వత్సన్నిధావుచ్ఛ్వసతీవ చేతః ||

శ్చ్యోతన్మయూఖే – (అమృతమును) స్రవించుచున్న కిరణములు కల

హిమద్యుతౌ అపి – చంద్రునియందు కూడ

న నిర్వృతమ్ – సుఖమును పొందని

మే చక్షుః – నా కన్ను

త్వత్సన్నిధౌ – నీ సన్నిధిలో

నిర్వృతమ్ ఏతి – సాంత్వన పొందుచున్నది.

సముజ్ఝిత జ్ఞాతివియోగ దుఃఖమ్ – బంధుజనులకు దూరమైనందువల్ల కలిగెడి దుఃఖమును విడిచినదై

చేతః – మనస్సు

సముచ్ఛ్వసతి ఇవ (అస్తి) – మరల ఆశ్వాసించుచున్నట్లు (ప్రాణవంతమైనట్లు, ఊపిరి తీసుకున్నట్లు)  అయినది.

అమృతమును స్రవించు కిరణములు కల చంద్రునియందు కూడ సుఖమును పొందని నా కన్ను నీ సన్నిధిలో సాంత్వన పొందుచున్నది. బంధుజనులకు దూరమైనందువల్ల దుఃఖితమైన నా మనస్సు ఆ దుఃఖమును విడిచిపెట్టి ఇప్పుడు మరల ఊపిరి తీసుకున్నట్లయినది. (నిన్ను చూసి ప్రాణం లేచివచ్చింది).

శ్చోత       –    m. oozing , sprinkling , aspersion L.

శ్చోతన   –     n. the act of oozing or flowing , exudation (see %{pra-zc-})

శ్చోతన్మయూఖ    –     fn. (pr. p. of %{zcut} + %{m-}) diffusing light MW.

ఆశ్వస్    –      P. %{-zvasiti} and %{-zvasati} (Impv. 2. sg. %{-zvasihi} and %{-zvasa} [MBh. vi , 490] ; impf. %{-azvasIt} [Bhat2t2.] and %{-azvasat} [Katha1s. xxxiii , 129]) A1. %{-zvasate} , to breathe , breathe again or freely ; to take or recover breath , take heart or courage ; to revive MBh. R. Katha1s. BhP. &c.: Caus. %{-zvAsayati} , to cause to take breath ; to encourage , comfort ; to calm , console , cheer up MBh. Sus3r. Ragh. Kum. &c.

ఆశ్వాస       –    m. breathing again or freely , taking breath ; recovery Sus3r. ; cheering up , consolation ; relying on Katha1s. ; a chapter or section of a book Sa1h.

* శ్లోకంలో శ్చ్యోత అని ఉంటే, డిక్షనరీలో శ్చోత అని మాత్రమే ఉంది. ఏది సరైనదో తెలీడం లేదు.

ప్రకటనలు

శ్రియం వికర్షత్యపహన్త్యఘాని శ్రేయః పరిస్నౌతి తనోతి కీర్తిమ్

సందర్శనం లోకగురోరమోఘం తవాత్మయోనేరివ కిం న ధత్తే ||

ఆత్మయోనేః ఇవ – స్వయంభువైన బ్రహ్మ యొక్క (దర్శనము) వలె

లోకగురోః – ఈ లోకమునకు గురువైన (జగద్గురువైన)

తవ – నీయొక్క

అమోఘం – అమోఘమైన (ఎన్నడూ నిష్ఫలము కాని)

సందర్శనం – సందర్శనము

శ్రియం – ఐశ్వర్యమును

వికర్షతి – బలముగా ఆకర్షించి ఇచ్చును.

అఘాని – పాపములను (దుఃఖములను) (అంహోదుఃఖవ్యసనేష్వఘమ్ – అమరం)

అపహన్తి – నష్టపరచును (తొలగించును).

శ్రేయః – శ్రేయస్సులను

పరిస్నౌతి – ప్రవహింపజేయును.

కీర్తిమ్ – కీర్తిని

తనోతి – వ్యాపింపజేయును.

(ఇన్ని మాటలేల?)

కిం న ధత్తే – ఏమి చేయదు?

స్వయంభువైన బ్రహ్మ యొక్క దర్శనమువలె జగద్గురువైన నీయొక్క అమోఘమైన దర్శనము ఐశ్వర్యమును బలముగా ఆకర్షించి ఇచ్చును. దుఃఖములను తొలగించును. శ్రేయస్సులను ప్రవహింపజేయును. కీర్తిని వ్యాపింపజేయును. ఇన్ని మాటలేల? నీ దర్శనము కలిగించని శుభమేదైన కలదా?

 • వికర్షతి అంటే వికర్షించడం అని అర్థం కాదా? ఇక్కడ విశేషంగా ఆకర్షించడం అని అర్థం చెప్పుకోవాలా?

అద్య క్రియాః కామదుఘాః క్రతూనాం సత్యాశిషః సంప్రతి భూమిదేవాః

ఆసంసృతేరస్మి జగత్సు జాతస్త్వయ్యాగతే యద్బహుమానపాత్రమ్ ||

అద్య – ఇప్పుడు

క్రతూనాం క్రియాః – యజ్ఞముల యొక్క అనుష్ఠానాది క్రియలు

కామ దుఘాః – కోరికలను ఈడేర్చునవిగా అయినవి.

సంప్రతి – ఇప్పుడు

భూమిదేవాః – భూసురులు (బ్రాహ్మణులు)

సత్యాశిషః – సత్యముగా ఫలించు ఆశీస్సులనిచ్చువారు అయినారు.

యత్ త్వయి ఆగతే – నీవు వచ్చుట వలన

ఆసంసృతేః – సృష్టి పర్యంతమూ (ఈ ప్రపంచము నిలచియున్నంతకాలమూ)

జగత్సు – ఈ ప్రపంచమునందు

బహుమాన పాత్రమ్ – గౌరవపాత్రుడను

అస్మి – అయినాను.

ఇప్పుడు యజ్ఞములయొక్క అనుష్ఠానాది క్రియలు కోరికలను ఈడేర్చునవిగా అయినవి. ఇప్పుడు బ్రాహ్మణులు సత్యముగా ఫలించు ఆశీర్వాదములను ఇచ్చువారు అయినారు. నీవు వచ్చుటవలన సృష్టి పర్యంతమూ ఈ ప్రపంచమునందు గౌరవపాత్రుడను అయినాను.

 • కరోతి క్రియతే వా ఇతి క్రతుః

అనాప్తపుణ్యోపచయైర్దురాపా ఫలస్య నిర్ధూతరజాః సవిత్రీ

తుల్యా భవద్దర్శనసంపదేషా వృష్టేర్దివో వీతబలాహకాయాః ||

అనాప్త పుణ్యోపచయైః – పుణ్యసంపద లేని వ్యక్తులచేత

దురాపా – పొందుటకు శక్యము కానిది,

ఫలస్య – సత్ఫలితమును

సవిత్రీ – ఇచ్చునది,

నిర్ధూత రజాః – రజోగుణమును నిర్మూలించునది అయిన

ఏషా – ఈ

భవత్ దర్శన సంపత్ – నీ దర్శనమనెడి సంపద (దర్శన భాగ్యము)

వీత బలాహకాయాః – మేఘములు తొలగిన

(నిర్ధూత రజాః – ధూళిని నిర్మూలించు)

దివః – పగటి యొక్క (ఆకాశము యొక్క)

వృష్టేః – వర్షముతో

తుల్యా – సమానమైనది.

పుణ్యసంపదలు లేని వ్యక్తులకు పొంద శక్యము కానిది, సత్ఫలితమును ఇచ్చునది, రజోగుణమును నిర్మూలించునది అయిన ఈ నీ దర్శన భాగ్యము మేఘములు తొలగి నిర్మలమైన ఆకాశము యొక్క వర్షముతో సమానమైనది.

 • ఈ ఉపమానం యొక్క ఔచిత్యం పూర్తిగా బోధపడలేదు. మేఘాలు తొలగడం ఆపదలు తొలగడాన్ని సూచిస్తుంది అని మాత్రం అనిపిస్తోంది.

ధర్మాత్మజో ధర్మనిబన్ధినీనాం ప్రసూతిమేనః ప్రణుదాం శ్రుతీనామ్

హేతుం తదభ్యాగమనే పరీప్సుః సుఖోపవిష్టం మునిమాబభాషే ||

ధర్మనిబన్ధినీనాం – ధర్మ ప్రతిపాదములైన

ఏనః ప్రణుదాం – పాపములను నశింపజేయు

శ్రుతీనాం – వేదములయొక్క

ప్రసూతిం – జన్మస్థానమైన

సుఖోపవిష్టమ్ – సుఖముగా ఆసీనుడైన

మునిం – మునిని

(ఉద్దేశించి)

తత్ అభ్యాగమనే – ఆయన వచ్చుటకుగల

హేతుమ్ – కారణమును

పరీప్సుః – తెలుసుకొనగోరినవాడై

ధర్మాత్మజః – యుధిష్ఠిరుడు

ఆబభాషే – (ఈవిధముగా) పలికెను.

ధర్మప్రతిపాదకములైన, పాపములను నశింపజేయు వేదములయొక్క జన్మస్థానమైన, సుఖముగా ఆసీనుడైన ఆ మునిని ఉద్దేశించి, ఆయన వచ్చుటకు గల కారణమును తెలుసుకొనగోరినవాడై యుధిష్ఠిరుడు ఈ విధముగా పలికెను.

 • ప్రణుద – removing, driving away

అనుద్ధతాకారతయా వివిక్తాం తన్వన్తమన్తఃకరణస్య వృత్తిమ్

మాధుర్యవిస్రమ్భవిశేషభాజా కృతోపసంభాషమివేక్షితేన ||

అనుద్ధత ఆకారతయా – శాంతమైన ఆకారముచేత

అన్తఃకరణస్య – అంతఃకరణము (మనస్సు) యొక్క

వివిక్తామ్ – పవిత్రమైన (వివిక్తౌ పూతవిజనౌ – అమరం)

వృత్తిమ్ – ప్రవృత్తిని (స్వభావమును)

తన్వన్తమ్ – ప్రకటము చేయుచున్న

మాధుర్య విస్రమ్భ విశేషభాజా – విశేషమైన మాధుర్యము (సౌమ్యత), విశ్వాసముతో కూడిన

ఈక్షితేన – దృష్టి చేత (దర్శనము చేత)

కృత ఉపసంభాషమ్ ఇవ – సంభాషణము చేసెనా అనునట్లు ఉన్న

శాంతమైన ఆకారముచేతనే తన మనస్సుయొక్క పవిత్రమైన వృత్తిని ప్రకటము చేయుచున్న, విశేషముగా మధురమైన, విశ్వాసముతో కూడిన తన చూపులచేతనే సంభాషించుచున్నాడా అనునట్లున్న –

 • ఉద్ధత – haughty

ప్రసాదలక్ష్మీం దధతం సమగ్రాం వపుఃప్రకర్షేణ జనాతిగేన

ప్రసహ్య చేతఃసు సమాసజన్తమసంస్తుతానామపి భావమార్ద్రమ్ ||

సమగ్రాం – సంపూర్ణముగా

ప్రసాదలక్ష్మీం – సౌమ్యమైన కళను

దధతం – ధరించియున్న

(అత ఏవ – అందువలననే)

జనాతిగేన – లోకోత్తరమైన (జనమ్ అతి గచ్ఛతి ఇతి – జనాతిగః)

వపుః ప్రకర్షేణ – ఉత్కృష్టమైన ఆకృతి చేత

అసంస్తుతానామ్ అపి – అపరిచితులకు కూడ (సంస్తవః స్యాత్ పరిచయః – అమరం)

చేతఃసు – మనసులలో

ఆర్ద్ర భావమ్ – స్నేహభావమును

ప్రసహ్య – బలముగా (శక్తివంతముగా)

సమాసజన్తమ్ – పుట్టించుచున్న

సంపూర్ణముగా సౌమ్యమైన కళను ధరించియున్న, లోకోత్తరమైన, ఉత్కృష్టమైన ఆకృతి చేత అపరిచితులకు కూడ మనసులలో బలముగా స్నేహభావమును పుట్టించుచున్న.

 • సమాసజన్తమ్ – fixing in, attaching to; hence giving rise to
 • ప్రకర్షః – excellence, grace

తతః శరచ్చన్ద్రకరాభిరామైరుత్సర్పిభిః ప్రాంశుమివాంశుజాలైః

బిభ్రాణమానీలరుచం పిశఙ్గీర్జటాస్తడిత్వన్తమివామ్బువాహమ్ ||

తతః – తరువాత

శరత్ చన్ద్ర కర అభిరామైః – శరదృతువునందలి చంద్రుని కిరణములవలె మనోహరమైన

ఉత్ సర్పిభిః – ఊర్ధ్వముఖముగా ప్రసరించుచున్న

అంశుజాలైః – కిరణముల సమూహములచేత

ప్రాంశుమ్ ఇవ – పొడుగరి వలె నున్న,

ఆనీలరుచం – నీలి కాంతులు వెదజల్లుచున్న,

పిశఙ్గీః – గోధుమ/పసుపు వర్ణము కల

జటాః – జటలను

బిభ్రాణమ్ – ధరించియున్న,

(అతః ఏవ – అందువలన)

తడిత్వన్తమ్ – మెరుపుతో కూడిన

అమ్బువాహమ్ ఇవ – మేఘమువలె

(స్థితమ్ – ఉన్న)

తరువాత, శరత్కాలమునందలి చంద్రుని కిరణములవలె మనోహరమైన కాంతిపుంజములు పైకి ప్రసరించుచుండుటచేత పొడుగరి వలె కన్పడుచున్న, నీలి కాంతులు వెదజల్లుచున్న, గోధుమవర్ణపు జటలను ధరించియుండుటచేత మెరుపుతో కూడిన మేఘమువలెనున్న –

 • వాక్యం తర్వాతి శ్లోకాల్లో పూర్తవుతుంది.
 • వ్యాసుడు నల్లగా ఉంటాడుట.
 • మాఘంలో నారదుడి వర్ణన ఇల్లాగే ఉంటుంది. నారదుడు కర్పూరంలాగా తెల్లగా ఉంటే జటలు మాత్రం పిశఙ్గవర్ణంలో ఉన్నట్టు వర్ణిస్తాడు. ఆయన కూడా శరచ్చంద్రుడి వంటి కాంతిని కలిగి ఉంటాడు.
 • మాఘానికీ ఈ కావ్యానికీ చాలా పోలిక ఉంది. మాఘం మొదటి సర్గలో నారదుడికీ కృష్ణుడికీ సంభాషణ ఉంటుంది. బహుశా దానికీ ఈ సర్గకీ పోలిక ఉండొచ్చు. ఇందులో మొదటి రెండు సర్గల్లోనూ ఉన్న రాజనీతి విశేషాలకీ మాఘం రెండో సర్గలోని రాజనీతి విశేషాలకీ పోలిక ఉంది. మాఘంలో కూడా బలరాముడు భీముడిలాగే ప్రతాపాన్ని కీర్తిస్తే ఉద్ధవుడు యుధిష్ఠిరుడిలాగా మంత్రాంగానికి ప్రాధాన్యతనిచ్చి సమాధానపరుస్తాడు.

వ్యక్తోదితస్మితమయూఖవిభాసితోష్ఠ

స్తిష్ఠన్మునేరభిముఖం స వికీర్ణధామ్నః

తన్వన్తమిద్ధమభితో గురుమంశుజాలం

లక్ష్మీమువాహ సకలస్య శశాఙ్కమూర్తేః ||

వ్యక్త ఉదిత స్మిత మయూఖ విభాసిత ఓష్ఠః – చక్కగా ఉదయించిన చిరునవ్వు యొక్క కాంతులచేత ప్రకాశించుచున్న పెదవులు కలిగినవాడై,

వికీర్ణ ధామ్నః – విస్తరించిన తేజస్సు కల

మునేః – మునికి

అభిముఖం – ఎదురుగా

తిష్ఠన్ – కూర్చుండి,

సః – అతడు

గురుమ్ అభితః – బృహస్పతికి అభిముఖముగా

ఇద్ధమ్ – ఉద్దీపించిన

అంశుజాలమ్ – కిరణముల సమూహమును

తన్వన్తమ్ – విస్తరింపజేయుచున్న

సకలస్య శశాఙ్క మూర్తేః – పూర్ణ చంద్రుని యొక్క

లక్ష్మీమ్ – శోభను

ఉవాహ – ధరించెను.

చక్కగా ఉదయించిన చిరునవ్వుయొక్క కాంతులచేత ప్రకాశించుచున్న పెదవులు కలిగినవాడై యుధిష్ఠిరుడు విస్తరించిన తేజస్సుకల మునికి ఎదురుగా కూర్చుండి, బృహస్పతికి అభిముఖముగా (ఉదయించి) ఉద్దీపించిన కిరణముల సమూహమును విస్తరింపజేయుచున్న పూర్ణచంద్రుని యొక్క శోభను ధరించెను.

 • దీనితో రెండో సర్గ సమాప్తం.
 • విభాసిత + ఓష్ఠః – విభాసితౌష్ఠః అవ్వాలి కదా, అచ్చు తప్పు పడిందా అనుకున్నాను. కానీ విభాసితోష్ఠః అని కానీ, విభాసితౌష్ఠః అని కానీ ఎలాగైనా సంధి చెయ్యొచ్చునట.
 • పండితులెవరైనా తప్పు పట్టారో లేదో తెలియదు కానీ ఇక్కడ ఉపయోగించిన ఉపమానంలో నాకు దోషం కనిపిస్తోంది. ఇక్కడ చంద్రుణ్ణి పూర్ణ చంద్రుడని అనకుండా ఉంటే నాకే సమస్యా ఉండేది కాదు. కానీ ఉదయిస్తున్న పూర్ణ చంద్రుడు అన్నాడు. అంటే చంద్రుడికి అభిముఖంగా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అన్నమాట. అదే చంద్రుడు గురుడికి అభిముఖంగా ఉదయిస్తున్నాడు. అంటే సూర్యుడూ, గురుడూ కలిసి ఉన్నారు అన్నమాట. అంటే గురుడు అస్తంగతుడు అయ్యాడు. (గురు మౌఢ్యం నడుస్తూ ఉన్నది.) అటువంటి గురుడు ‘వికీర్ణ ధాముడు – విస్తరించిన తేజస్సు కలవాడు’ అవ్వడం కుదరదు. అనౌచిత్యం.

అవిహితహృదయో విధాయ సో2ర్హామృషివదృషిప్రవరే గురూపదిష్టామ్

తదనుమతమలంచకార పశ్చాత్ప్రశమ ఇవ శ్రుతమాసనం నరేన్ద్రః ||

సః – అతడు (యుధిష్ఠిరుడు)

అవిహిత హృదయః – ఏకాగ్ర చిత్తము కలవాడై

ఋషిప్రవరే – ఋషులలో శ్రేష్ఠుడైన వ్యాసునకు

ఋషివత్ – ఋషులకు యోగ్యమైన

గురూపదిష్టామ్ – పెద్దలు (శాస్త్రవిదులు) ఉపదేశించిన

అర్హామ్ – పూజను

విధాయ – చేసి

పశ్చాత్ – తరువాత

తదనుమతమ్ – వ్యాసునిచేత అనుమతింపబడిన

ఆసనమ్ – ఆసనమును

ప్రశమః – శాంత భావము

శ్రుతమ్ ఇవ – శాస్త్ర శ్రవణమును వలె (అలంకరించు తీరుగా)

అలంచకార – అలంకరించెను.

యుధిష్ఠిరుడు ఏకాగ్ర చిత్తము కలవాడై ఋషులలో శ్రేష్ఠుడైన వ్యాసునకు ఋషులకు యోగ్యమైన, పెద్దలు ఉపదేశించిన పూజను చేసి, తరువాత ఆయనచేత అనుమతింపబడిన ఆసనమును శాంత భావము శాస్త్ర శ్రవణమును అలంకరించు తీరుగా అలంకరించెను.

ప్రకటనలు
ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« ఫిబ్ర    
 1234
567891011
12131415161718
19202122232425
262728  

Blog Stats

 • 2,124 hits